Advertisement
Kantara Chapter 1 english Dubbed version update

Kantara Chapter 1 : కాంతార మరో ముందడుగు.. అరుదైన రికార్డు ఇది..

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి (Rishab shetty) భారీ బడ్జెట్ తో నటించి దర్శకత్వం వహించిన కాంతార చాప్టర్ 1 థియేటర్లలో దసరా కానుకగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. రిలీజ్ అయి మూడు వారాలైనా ఇప్పటికి మంచి హోల్డ్ చూపిస్తూ 800 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతుంది. అయితే తాజాగా కాంతార చాప్టర్ 1 మరో రేర్ ఫీట్ ని అందుకోవడానికి రెడీ అవుతుంది.

Advertisement

కాంతార చాప్టర్ 1 ని ఇంగ్లీష్ భాషలో డబ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అది కూడా ఈ నెల అనగా అక్టోబర్ 31 న కాంతార చాప్టర్ 1 ని ఇంగ్లీష్‌ వెర్షన్ ను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఇంతవరకు ఏ కన్నడ సినిమా కూడా ఇంగ్లీష్ లో డబ్ కాలేదని, కాంతారా యే ఈ రికార్డ్ సాధించే మొదటి సినిమా అని సమాచారం.

Advertisement

అయితే కాంతార సినిమాలో ఇంగ్లీష్ వెర్షన్ కి అనుగుణంగా కొన్ని సీన్లు కట్ చేయించి 2 గంటల 14 నిమిషాలకు సినిమాని కుదించారట. అంటే మూవీ ఒరిజినల్ నుండి మరో 35 నిమిషాల సీన్స్ ని తీసేసినట్టు సమాచారం. మరి ఇంగ్లీష్ లో కాంతారా అక్కడి ఆడియన్స్ ని ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక కాంతార చాప్టర్ 1 లో రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్ హీరో హీరోయిన్లుగా నటించగా, హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మించారు.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement