మన పత్రిక వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లాలో వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితులకు తెలంగాణ ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించింది. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. మంత్రి సీతక్కకు పంపిన నివేదిక ఆధారంగా ఈ నిధులు మంజూరయ్యాయి. నగరంలో పాక్షికంగా దెబ్బతిన్న 67 ఇళ్లకు ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున, పూర్తిగా దెబ్బతిన్న 67 ఇళ్ల మరమ్మతుకు ఒక్కొక్కరికి రూ.11,500 చొప్పున ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. వరద బాధితులందరికీ సమన్యాయం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు ఈ ఆర్థిక సహాయం కొంత ఉపశమనం కలిగిస్తుందని అధికారులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
