మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: కాచిగూడ – యశ్వంతపూర్ (బెంగళూరు) మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అలర్ట్ ఇచ్చింది. ఈ రైలు రాకపోకల సమయాల్లో (హిందూపూర్ స్టేషన్ వద్ద) స్వల్ప మార్పులు చేసినట్లు ప్రకటించింది.
కొత్త షెడ్యూల్ ప్రకారం.. యశ్వంతపూర్ నుంచి వచ్చే రైలు (20704) హిందూపూర్‌కు ఇకపై మధ్యాహ్నం 3:55 గంటలకు చేరుకుని 3:57కి బయలుదేరుతుంది. అలాగే, కాచిగూడ నుంచి వెళ్లే రైలు (20703) హిందూపూర్‌కు మధ్యాహ్నం 12:17కి చేరుకుని 12:19కి కదులుతుంది. ఈ కొత్త మార్పులు మార్చి 15 నుంచి అమల్లోకి రానున్నాయి.
నిత్యం ఈ మార్గంలో రాకపోకలు సాగించే వందలాది మంది ప్రయాణికులు ఈ స్వల్ప సమయ మార్పును ముందే గమనించుకుంటే, స్టేషన్లలో రైలు మిస్ అవ్వడం లేదా అనవసరంగా నిరీక్షించే ఇబ్బంది తప్పుతుంది.
బుధవారం మినహా వారంలో ఆరు రోజులు ఈ రైలు సేవలు అందుబాటులో ఉంటాయి.
ఇవి కూడా చదవండి :
- సింహ రాశి వారికి రాజయోగం.. ఆ మూడు రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి!
- బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి ఫిక్స్.. లాయర్ ఇంటి అల్లుడు కానున్న యంగ్ హీరో!
- నా కథను నాశనం చేశారు.. వరలక్ష్మి ‘సరస్వతి’ మూవీపై సాయి మాధవ్ ఫైర్!
- ఢిల్లీలో ఇరాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ట్రంప్ కు స్ట్రాంగ్ కౌంటర్!
- ఎక్కడో క్షిపణుల మోత.. ఇక్కడ వంటింట్లో మంట.. సామాన్యుడిపై వార్ ఎఫెక్ట్!
