Advertisement

జూరాలకు పెరుగుతున్న వరద శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగు

మన పత్రిక: కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పోటెత్తుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో జూరాల జలాశయానికి ప్రస్తుతం 32,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది.

ప్రాజెక్టుకు వరద నీరు పెరుగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు క్రస్ట్ గేట్లను ఎత్తివేశారు. జూరాల ప్రాజెక్టుకు వస్తున్న వరదను వచ్చినట్లుగానే దాదాపు 30,700 క్యూసెక్కుల నీటిని గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు.

Advertisement

జూరాల ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నిలకడగా కొనసాగుతుండటంతో, దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి కృష్ణా నది వరద ప్రవాహం వేగంగా చేరుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో కూడా నీటి ఉధృతి క్రమంగా పెరుగుతోంది.

Advertisement