Jubilee Hills By Poll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. ఇప్పటికే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అయింది. ఇప్పటి వరకు ఐదు రౌండ్లు ముగిశాయి. ఐదు రౌండ్లు కలిపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు షేక్ పేట్, ఎర్రగడ్డ, రహమత్ నగర్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది.
మొదటి రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి 8911 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థికి 8864 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 2167 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్ లో కాంగ్రెస్ కి 9691 ఓట్లు రాగా, మాగంటి సునీతకు 8609 ఓట్లు, దీపక్ రెడ్డికి 3475 ఓట్లు వచ్చాయి.
మూడో రౌండ్ లో నవీన్ యాదవ్ కు 11082 ఓట్లు, మాగంటి సునీతకు 8082 ఓట్లు వచ్చాయి. దీపక్ రెడ్డికి 3475 ఓట్లు వచ్చాయి. నాలుగో రౌండ్ లో నవీన్ యాదవ్ కు 9567 ఓట్లు, సునీతకు 6020 ఓట్లు, ఐదో రౌండ్ లో నవీన్ యాదవ్ కు 12,283 ఓట్లు, సునీతకు 8985 ఓట్లు వచ్చాయి.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
