Advertisement

ఎన్టీఆర్ ‘డ్రాగన్’ విడుదల తేదీలో మార్పు లేదు

మన పత్రిక: జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ‘డ్రాగన్’ సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ స్పష్టం చేసింది. ఎన్టీఆర్ చేతికి గాయం కావడం, శస్త్రచికిత్స జరగడంతో ఈ చిత్రం వాయిదా పడే అవకాశం ఉందంటూ గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వచ్చాయి. ఈ ప్రచారంపై మైత్రి రవి శంకర్ స్పందిస్తూ, ముందే ప్రకటించిన సమయానికే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని తెలిపారు.

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న నిర్మాత రవి శంకర్, డ్రాగన్ విడుదలపై వస్తున్న పుకార్లకు స్వస్తి చెప్పారు. అధికారికంగా ముందే నిర్ణయించినట్లుగానే 2027 జూన్ 11న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. నిర్మాత క్లారిటీ ఇవ్వడంతో ఎన్టీఆర్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
Advertisement