Advertisement

జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా షూటింగ్ అప్‌డేట్

మన పత్రిక: టాలీవుడ్ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స జరగడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన తదుపరి చిత్రంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ త్వరలోనే తిరిగి షూటింగ్ ప్రారంభించుకోనుంది. దాదాపు రెండు వారాల్లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.

చిత్ర నిర్మాత మైత్రీ రవిశంకర్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ సినిమా తదుపరి షూటింగ్‌ను ఎలాంటి పెద్ద విరామాలు లేకుండా 2027 ఫిబ్రవరి వరకు నిరంతరాయంగా కొనసాగించాలని చిత్ర బృందం యోచిస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

దేశభక్తి నేపథ్యంలో సాగే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్, అనిల్ కపూర్, బిజు మీనన్, ఖుష్బూ సుందర్, గురు సోమసుందరం, రాజీవ్ కనకాల, అశుతోష్ రాణా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Advertisement