మన పత్రిక, విజయవాడ: మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ కుటుంబ సభ్యులపై నమోదైన గృహహింస, వరకట్న వేధింపుల కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వారు విజయవాడలోని మహిళా కోర్టును ఆశ్రయించారు. తమను పోలీసులు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లలో కోరారు. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, కేసు వివరాలపై పూర్తిస్థాయి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఇబ్రహీంపట్నం పోలీసులను ఆదేశించింది.
జోగి రమేశ్ పెద్ద కోడలు మేఘన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం, గృహహింసతో పాటు వరకట్న నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసు ఎఫ్ఐఆర్లో జోగి రమేశ్, ఆయన సోదరుడు రాము, సోదరి రమ సహా మొత్తం 11 మంది కుటుంబ సభ్యుల పేర్లను పోలీసులు నిందితులుగా చేర్చారు.
కోడలి ఫిర్యాదుతో కేసులు నమోదు కావడంతో జోగి రాజీవ్, రమేశ్, శకుంతల, రోహిత్, ప్రియాంక, జోగి రాము, ఆయన కుమారులు రాకేశ్, పాండు, అలాగే స్వామి, రమ, సాయి చట్టపరమైన రక్షణ పొందడానికి ఈ ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
