మన పత్రిక, వెబ్‌డెస్క్
Job mela Karimnagar on 3 September
కరీంనగర్ జిల్లా ఎంప్లాయ్మెంట్ కార్యాలయం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 3, 2025న ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళా ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ కార్యాలయంలో జరుగుతుంది.
ఈ మేళాలో 120 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు ఫార్మసిస్ట్ (40), కస్టమర్ సేల్స్ అసిస్టెంట్ (20), స్టాక్ పికింగ్ & ప్యాకింగ్ అసిస్టెంట్ (30), ఆడిట్ అసిస్టెంట్ (30) పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. అభ్యర్థులు పదోతరగతి, ఇంటర్, ఏదైనా డిగ్రీ లేదా డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి. ఫార్మసిస్ట్ పోస్టులకు D.Pharm లేదా B.Pharm అర్హత తప్పనిసరి.
వయస్సు 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రయోజనాల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లో పనిచేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, బయోడేటా, రెండు రిసెంట్ ఫోటోలతో మేళాకు హాజరుకావాలి.
మరింత సమాచారం కోసం 9392013323, 8895337496, 7207659998 నంబర్లలో సంప్రదించవచ్చు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
