టెలివిజన్ స్టార్ ప్రభాకర్ (Prabhakar) కొడుకు చంద్రహాస్ (Chandrahas) హీరోగా సక్సెస్ కాకున్నా, ట్రోలర్ల బారిన పడి వారికి మంచి స్టఫ్ నే ఇస్తున్నాడు. హీరోగా మానేస్తే తనకే మంచిది అంటూ నెటిజన్లు సైతం ఫైర్ అవుతున్నారు. అసలు అడుగుపెట్టిన తొలి సినిమా ‘రామ్ నగర్ బన్నీ’ (Ramnagar bunny) తోనే భారీగా ట్రోల్ అయ్యాడు. కానీ సినిమాకి పైసా కూడా రాలేదు. ఇప్పుడు మరో సినిమాతో ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తుంటే, మళ్ళీ తనకు తానే గొయ్యి తవ్వుకున్నట్టు ట్రోలర్ల బారిన పడ్డాడు. అయితే ఈసారి ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఫైర్ అవుతుండడం గమనార్హం. నటుడు హీరో జెడి చక్రవర్తి (JD Chakravarthy) తాజాగా చంద్రహాస్ పై ఫైర్ అయ్యారు.
వివరాల్లోకి వెళ్తే, చంద్రహాస్ నటిస్తున్న తాజా సినిమా ‘బరాబర్ ప్రేమిస్తా’ (Barabar Premistha) ఈ వారం ఫిబ్రవరి 6న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజీపై అత్యుత్సాహంతో బూతు పదాలు ఉన్న పాట పాడటం పెద్ద దుమారమే లేపింది. పైగా ఇండస్ట్రీ నటులు, మహిళలు కూడా హాజరైన ఈవెంట్ లో ఇలాంటి పాటలు పాడడం ఏంటి అంటూ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. అలాగే ఈ విషయంపై స్పందిస్తూ, గెస్ట్ గా హాజరైన జెడి చక్రవర్తి స్పందించారు. అయన మాట్లాడుతూ ‘చంద్రహాస్ ఆ పాట పాడుతున్నప్పుడు తాను కూడా షాక్ లో ఉన్నానని, తను ఏం పాడుతున్నాడో మొదట అర్థం కాలేదని, అయితే తన పాటని నేను ఆస్వాదించినట్లు, చప్పట్లు కొడుతున్నట్లు కొందరు వీడియో ఎడిట్ చేసి నన్ను ట్రోల్ చేస్తున్నారని, తాను అసలు ఆ పని చేయలేదని, కావాలంటే ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుందని చెప్పుకొచ్చారు.
అలాగే ఇలాంటి ఈవెంట్లలో గెస్టులు మాట్లాడేది కూడా చాలా మంది వినరు. పక్కనున్న వారితో మాట్లాడటం వల్ల వారిని పలకరిస్తూ, స్టేజీపై ఎవరేం మాట్లాడుతున్నారో సరిగ్గా పట్టించుకోరు. అప్పుడు నేను కూడా ఆ పరిస్థితుల్లో ఉండడం వల్ల పట్టించుకోలేదని, పైగా తన పక్కన ఉన్న అమ్మాయికి తెలుగు అర్థం కాక పాపం చప్పట్లు కొట్టిందంటూ, చెప్పుకొచ్చారు. అలాగే తాను బూతులు మాట్లాడను, తన ముందు ఎవరైనా బూతులు మాట్లాడినా సహించనని ఓసారి సెట్లో బూతులు మాట్లాడాడని ఓ డైరెక్టర్ ని కొట్టానని జెడి చక్రవర్తి చెప్పుకొచ్చారు.
అలాగే ఈవెంట్ గురించి జెడి చక్రవర్తి మాట్లాడుతూ అసలు తాను అప్పటికప్పుడు లేచి వెళ్లిపోదామనుకున్నానని, ఆ విషయం తెలిసి పూజా బేడీ (Pooja bedi) తనని పక్కకి లాక్కెళ్లి అలా చేయొద్దని చెప్పినందుకు, అక్కడ తప్పనిసరి సైలెంట్ గా ఉన్నానని, లేకపోతే సినిమాపై నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుందని ఉన్నానన్నారు. కానీ చంద్రహాస్ అలా చేయడాన్ని తాను సమర్థించనని, ఇలాంటి చెత్త ప్రమోషన్లతో సినిమాలు ఆడతాయనుకుంటే అది కేవలం వాళ్ల భ్రమ మాత్రమే’ అని జేడీ చక్రవర్తి ఫైర్ అయ్యారు. మరి ఈ నెగిటివిటి సినిమాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
