Advertisement

ఇరుముడి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్ర రెమ్యునరేషన్ ఎంతంటే?

మన పత్రిక: రవితేజ కథానాయకుడిగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తండ్రీకూతుళ్ల భావోద్వేగాలు, అయ్యప్ప దీక్ష నేపథ్యంతో వచ్చిన ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్ర నటనపై ప్రత్యేకంగా ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఆమె ‘మనమ్మ’ అనే ముఖ్యమైన పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా నక్షత్రను దర్శకుడి బృందం గుర్తించినట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. నక్షత్ర సోషల్ మీడియా వీడియోలను చూసిన చిత్రబృందం, హైదరాబాద్‌లో నిర్వహించిన ఆడిషన్స్‌కు పిలిచి ఈ పాత్రకు ఎంపిక చేసింది. తొలి తెలుగు చిత్రంలోనే ప్రాధాన్యం ఉన్న పాత్ర లభించడంతో నక్షత్ర మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement

ఈ చిత్రంలో నటించినందుకు గాను నక్షత్రకు దాదాపు రూ. 10 లక్షల వరకు రెమ్యునరేషన్ లభించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పారితోషికం వివరాలపై అధికారిక ప్రకటన రానప్పటికీ, ఆమె పాత్ర ప్రాధాన్యతను బట్టి ఈ మొత్తాన్ని అందించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాతో నక్షత్రకు మరింతగా నటనావకాశాలు వచ్చే అవకాశం ఉంది.

Advertisement