Advertisement
iPhone 18 pro to launch in different colours

iPhone 18 : సరికొత్త కలర్స్‌తో ఐఫోన్ 18 లాంచ్.. రిలీజ్ అయ్యేది అప్పుడే..!

iPhone 18 : ఐఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐఫోన్ అంటే ఒక స్టేటస్ కు సింబల్. అప్పు చేసి అయినా సరే ఐఫోన్ చేతుల్లో ఉండాలి అని అనుకుంటారు చాలామంది. ఐఫోన్ లవర్స్ అయితే ఎప్పుడెప్పుడు కొత్త కొత్త సిరీస్ లాంచ్ అవుతుందా అని వెయిట్ చేస్తుంటారు. ఇప్పటికే ఐఫోన్ 17 సిరీస్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. వచ్చే సంవత్సరం సెప్టెంబర్ లో ఐఫోన్ 18 విడుదల కానుంది. అయితే.. ఈసారి రిలీజ్ అయ్యే సిరీస్ సరికొత్త కలర్స్ తో విడుదల కానున్నట్టు తెలుస్తోంది.

Advertisement

సెప్టెంబర్ 2026 లో ఐఫోన్ 18 ప్రోతో పాటు సెకండ్ జనరేషన్ ఐఫోన్ ఎయిర్, ఫస్ట్ జనరేషన్ ఐఫోన్ ఫోల్డ్ ను విడుదల చేయనున్నారు. Burgundy, Coffee, purple కలర్స్ లో ఐఫోన్ 18 సిరీస్ విడుదల కానుంది. ఇందులో పర్పుల్ కలర్ మాత్రం గతంలో వచ్చిన ఐఫోన్లలో ఉన్నదే కానీ.. ఇతర రెండు కలర్స్ మాత్రం కొత్తవి. ఐఫోన్ 18 తోనే ఇవి రానున్నాయి.

Advertisement

ఐఫోన్ 18 సిరీస్ మోడల్ ఫోన్లు 6.26 ఇంచ్ ఎల్టీపీవో ఓఎల్ఈడీ ప్యానెల్, 1.5 కే రిజల్యూషన్, హెచ్ఐఏఏ టెక్నాలజీ, అండర్ డిస్ ప్లే ఫేస్ ఐడీ సెన్సార్ లాంటి ఫీచర్లతో రానున్నాయి.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement