Inter Student Missing : నాకు కాలేజీ నచ్చలేదు. నన్ను వెతకొద్దు.. అంటూ లేఖ రాసి ఇంటర్ స్టూడెంట్ మిస్ అయిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని బోధన్ పట్టణంలో ఉన్న విజేత జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అర్జున్ అనే విద్యార్థి తనకు కాలేజీ నచ్చలేదని.. తన కోసం వెతకొద్దని లేఖ రాసి మరీ కాలేజీ హాస్టల్ నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అర్జున్ కోసం గాలిస్తున్నారు.
అమ్మ మరియు నాన్న దయచేసి నన్ను క్షమించండి. నేను చేసిన పని తప్పు కాని నాకు వేరే మార్గం లేదు. అక్కని బాగా చూసుకోండి. అమ్మ ప్లీజ్ నేను 5 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇంటికి వస్తాను. ఎందుకంటే నేను ఆర్మీ ట్రెయినింగ్ కి వెళ్తున్నాను. దయచేసి నాకోసం వెతకకండి. నేను అక్కడ సంతోషంగా ఉంటాను అని చెప్పి లెటర్ రాసి అర్జున్ కాలేజీ హాస్టల్ నుంచి వెళ్లిపోయాడు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

