మన పత్రిక, వెబ్‌డెస్క్: ఇండోనేషియా (Indonesia)లోని సెంట్రల్ జావా ప్రాంతంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జకార్తా నుంచి యోగ్యకర్తకు వెళ్తున్న ‘కహాయా ట్రాన్స్‌పోర్టు’ (Kahaya Transport) బస్సు అదుపుతప్పి క్రాప్యాక్ టోల్ గేట్ ఎగ్జిట్ వద్ద ఉన్న భారీ కాంక్రీట్ దిమ్మను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జవ్వగా.. 15 మంది ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
Advertisement
ప్రమాద వివరాలు:
- మొత్తం ప్రయాణికులు: 34 మంది.
- మృతులు: 15 మంది.
- క్షతగాత్రులు: 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం సెమారాంగ్లోని RSUP డాక్టర్ కరియాది ఆసుపత్రికి తరలించారు.
- కారణం: బస్సు అధిక వేగంతో ప్రయాణించడం వల్లే అదుపుతప్పిందని సెమారాంగ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ చీఫ్ బుదియోనో వెల్లడించారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
