మన పత్రిక, వెబ్ డెస్క్: రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పంపిణీ చేశారు. యాదగిరిగుట్టలోని బీర్ల నిలయంలో బొమ్మలరామారం, తుర్కపల్లి మండలాలతో పాటు ఆలేరు పట్టణానికి చెందిన 94 మంది లబ్ధిదారులకు ఈ పట్టాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి, నియోజకవర్గానికి అదనంగా మరో 200 ఇండ్లను మంజూరు చేయించుకోగలిగానని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు అనేది నిరంతర ప్రక్రియ అని, ప్రతి సంవత్సరం 3,500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఆయన వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, ప్రతి పేదవాడి ఇంటి కలను సాకారం చేసి ఇందిరమ్మ ఆశయాలను నెరవేర్చుతామని ఆయన పేర్కొన్నారు. లబ్ధిదారులు త్వరగా ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేసుకుని గృహప్రవేశాలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ చైతన్యామహేందర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ భరత్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
