మన పత్రిక: వెస్ట్ ఆసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇరాన్‌లోని భారతీయులకు టెహ్రాన్‌లోని భారత ఎంబసీ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు కఠిన అల్టిమేటం ఇవ్వడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. దీంతో రాబోయే 48 గంటలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది.
మిలిటరీ ప్రాంతాలు, పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎత్తైన భవనాల పై అంతస్తులకు వెళ్లడం పూర్తిగా నివారించాలని స్పష్టం చేసింది. ఇరాన్ నిర్ణయం తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఎంబసీతో కాంటాక్ట్‌లో ఉంటూ అధికారిక అప్‌డేట్స్ ఫాలో అవ్వాలని కోరారు. ప్రపంచానికి కీలకమైన ఆయిల్ రూట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌లో ఈ ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రస్తుతం ఇరాన్‌లో విద్యార్థులతో సహా సుమారు 9,000 మంది భారతీయులు ఉండగా, వీరిలో ఇప్పటివరకు 1,800 మంది స్వదేశానికి తిరిగి వచ్చారు.
ఇవి కూడా చదవండి :
- ఏఐసీసీకి ఏటీఎంగా తెలంగాణ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఫైర్
- మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. రోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత
- కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు వాయిదా.. కేసీఆర్ పిటిషన్‌పై ఏప్రిల్ 22న విచారణ
- HBD Alluarjun : ‘రాకా’ గా మారిన పుష్పరాజ్.. సాలిడ్ సప్రైజ్..
- Gold Rate Today – April 8, బుధవారం బంగారం ధరలు!
