Saudi Accident : సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ట్రావెల్స్ బస్సు.. డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టడంతో బస్సులో ఉన్న 43 మంది ప్రయాణికుల్లో 42 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. సజీవ దహనం అయిన 42 మంది ఇండియన్సే. అందులో ఉన్నవాళ్లంతా హైదరాబాద్ వాళ్లే అని తెలుస్తోంది.
మక్కా దర్శనం కోసం వెళ్లిన వాళ్లు అక్కడ దర్శనం పూర్తి చేసుకొని అనంతరం మదీనాకు వెళ్తుండగా బదర్ – మదీనా రూట్ లో మఫరహత్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో 20 మంది మహిళలు, 12 మంది చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. సౌదీ సమయం ప్రకారం అర్ధరాత్రి 1.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన నుంచి తప్పించుకొని ఒక్క వ్యక్తి బయట పడినట్లు సమాచారం.
ఈ ఘటనలో ఎక్కువ మంది తెలంగాణ వాళ్లు అందులోనూ హైదరాబాద్ వాళ్లు ఎక్కువగా ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయింది. సౌదీలో ఉన్న భారత ఎంబసీ అధికారులతో తెలంగాణ ప్రభుత్వం మాట్లాడుతోంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
