Advertisement

India Post Jobs Update 2026 : తపాలా (పోస్ట్ ఆఫీస్) ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చేసింది…

నిరుద్యోగులకు శుభవార్త. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పోస్ట్ ఆఫీస్ (Post Office) జాబ్స్ కి నోటిఫికేషన్ వచ్చేసింది. కేంద్ర తపాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్‌ శాఖల్లో 2026 సంవత్సరానికి గానూ పోస్టల్ శాఖలో పలు స్థానాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. అందిన సమాచారం ప్రకారం దేశం మొత్తంలో ఏకంగా 28,740 గ్రామీణ డాకా సేవక్ (GDS) పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్‌ విడుదల అవుతుంది. ఈ మేరకు ఇప్పటికే ఇండియా తపాలా శాఖ ఏర్పాట్లు చేసేస్తుంది. ఇక ఈ జనవరి నెల ఆఖరి తేదీలోపు నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇక అర్హత విషయానికి వస్తే.. ఈ ఉద్యోగాలకు పదో తరగతి పాస్ అయితే సరిపోతుంది. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే అభ్యర్ధులను ఎంపిక చేస్తారని సమాచారం. పైగా ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఉద్యోగులకు ఆయా సంబంధిత జిల్లా, మండలాల్లో ఉద్యోగాలు కేటాయిస్తారు. ఇక ఈ నోటిఫికేషన్‌ కింద బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (BPM), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ABPM), మరియు డాకా సేవక్‌ పోస్టులను భర్తీ చేయనుందని సమాచారం. ఇక పోస్టల్ శాఖలో ఇతర ఉద్యోగాల వివరాలకు, లేదా మరింత సమాచారం కొరకు ఇండియా పోస్టు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Advertisement
Advertisement