Ind Vs Aus First Odi 2025 Harshit Rana: పెర్త్ మైదానంలో జరిగిన తొలి ODIలో టీమిండియా 26 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లు స్టార్క్, హేజిల్ వుడ్, కూనెమన్, ఓవెన్ అద్భుతంగా బౌలింగ్ వేశారు. కేఎల్ రాహుల్ (38), అక్షర్ (31) టాప్ స్కోరర్లు.
137 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. ముఖ్యంగా హర్షిత్ రాణా బౌలింగ్‌లో పండగ చేసుకుంది. నాలుగు ఓవర్లు వేసి 27 పరుగులు సమర్పించుకున్నాడు. అతని బౌలింగ్ లైన్ & లెంగ్త్ పూర్తిగా ఫెయిల్ అయ్యింది.
అతడు ఆస్ట్రేలియా మైదానాలకు అలవాటు ఉన్నా.. ఇటీవలి సిరీస్‌లలో తనను తాను నిరూపించుకోలేకపోయాడు. అయినా కోచ్ గౌతమ్ గంభీర్ అతనికి ఛాన్స్ ఇచ్చారు. కానీ అతడు మళ్లీ నిరాశ జనకంగా ప్రదర్శించాడు. క్రికెట్ విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు: “గంభీర్ హర్షిత్‌ను జట్టులో బలవంతంగా రుద్దుతున్నాడు. ఇలాంటి ప్రదర్శనలతో ముందు జట్టులో చోటు కష్టం.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
