Advertisement

హైదరాబాద్: పెళ్లి దుస్తుల్లో ధరించి OYOలో సూసైడ్

మన పత్రిక, క్రైం: హైదరాబాద్ కేపీహెచ్‌బీ పరిధిలో శుక్రవారం ఉదయం ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అనంతపురం జిల్లా పొట్లూరు మండలం చెర్లోపల్లికి చెందిన వనమల లోకేశ్‌ (29) నగరంలోని గండిమైసమ్మ ప్రాంతంలో ఒక ఫార్మా కంపెనీలో పని చేసేవాడు. లోకేశ్ గత రెండేళ్లుగా సహచరితో ప్రేమలో ఉన్నాడు. ఇద్దరూ వివాహానికి ముందే నిర్ణయం తీసుకొని, పెళ్లి బట్టలు కూడా కొనుగోలు చేసుకున్నారు. శుక్రవారం లోకేశ్ ఓయో గదిని అద్దె తీసుకొని, పెళ్లి బట్టలు ధరించి, యువతిని భోజనం కోసం పంపాడు. కొంతసేపటికి యువతి గదికి తిరిగి వెళ్లగా, లోకేశ్ స్పందించలేదు. స్నేహితులు సహాయం కోసం వచ్చి గది తలుపులు తెరిచినపుడు లోకేశ్ ఫ్యాన్‌కు ఉరివేసి మృతిచెందినట్లు గుర్తించబడింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం తీసుకొని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. స్థానికంగా ఈ సంఘటన విషాదాన్ని సృష్టించింది.

Advertisement