మన పత్రిక, వెబ్డెస్క్
కాకినాడ: ఆర్థిక ఇబ్బందులతో(Financial problems) భర్త ఆత్మహత్య చేసుకున్న రెండు నెలలకే అతని భార్య తీవ్ర మనోవేదనకు గురై రెండేళ్ల కుమారుడికి విషమిచ్చి, తానూ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సర్పవరం భావనారాయణపురంలోని గాంధీనగర్లో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనతో రెండు కుటుంబాలు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయాయి.
జనపల్లి గోపి అనే ఉద్యోగి కుమారుడి పుట్టినరోజు కోసం రూ. 3 లక్షల అప్పు చేసి, వాటిని తీర్చలేక జులై 22న ఆత్మహత్య(suicide) చేసుకున్నారు. భర్త మరణంతో కుంగిపోయిన అతని భార్య ఆకాంక్ష, గత నెల 31న తన రెండేళ్ల కుమారుడు సార్విక్తో కలిసి విషం తీసుకున్నారు. కుటుంబసభ్యులు వెంటనే వారిని కాకినాడ జీజీహెచ్లో చేర్చగా, పరిస్థితి విషమించడంతో తల్లీబిడ్డలు బుధవారం మృతిచెందారు. ఈ ఘటనపై సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
