WhatsApp
Advertisement

Hong Kong fire : హాంకాంగ్ టవర్స్ అగ్ని ప్రమాదం.. 44 మంది సజీవ దహనం

Hong Kong fire : దక్షిణ చైనాలో ఉన్న హాంకాంగ్ నగరం మొత్తం అట్టుడికిపోయింది. అతి ఎత్తైన బిల్డింగ్స్ సముదాయంలో మంటలు అంటుకోవడంతో ఆ ప్రాంతంలో ఉన్న అపార్ట్‌మెంట్స్ అన్నీ మంటల్లో చిక్కుకుపోయి సుమారు 44 మంది అపార్ట్‌మెంట్ వాసులు సజీవ దహనం అయ్యారు. వందలాది మంది ఆచూకీ లభించడం లేదు. చైనా టైమ్ ప్రకారం బుధవారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన చోటు చేసుకోగా అప్పటి నుంచి రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

8 బిల్డింగ్‌ల సముదాయంగా ఉన్న ఈ అపార్ట్‌మెంట్ లో సుమారు 2000 ఇళ్లు ఉన్నాయి. 32 అంతస్థుల టవర్స్ ఉన్నాయి. అసలు మంటలు ఎలా వ్యాపించాయి అనేది తెలియడం లేదు. ఇందులో కొన్ని బిల్డింగులు రిపేర్ లో ఉన్నాయి. అక్కడ మళ్లీ రీ కన్‌స్ట్రక్షన్ జరుగుతోంది. దాని కోసమని వెదురు బొంగులతో బిల్డింగ్ చుట్టూ కట్టారు. అందుకే మంటలు త్వరగా బిల్డింగ్ అంతా వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు.

Advertisement

పున:నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లో మండే స్వభావం ఉన్న కొంత మెటీరియల్ అక్కడే ఉండిపోయిందని.. దాన్ని అక్కడే వదిలేసిన ముగ్గురు కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మేము ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారు. కానీ.. ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు.. అంటూ అదే అపార్ట్‌మెంట్ లో ఉంటున్న 65 ఏళ్ల ఓ వ్యక్తి చెప్పుకొచ్చారు.

మెయింటెనెన్స్ వర్క్ జరుగుతుండటం వల్ల మేము మా కిటికీలు, డోర్లు అన్నీ మూసేసాం. మంటలు వ్యాపించాయనే విషయమే తెలియదు. మా పొరుగింటి వారు ఫోన్ చేసి మంటలు చెలరేగాయి అని చెప్పడంతో వెంటనే మేము కిందికి వచ్చేశాం.. అంటూ ఆ వ్యక్తి తెలిపారు.

Advertisement