Harish Rao : బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేత, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తండ్రి ఇక లేరు. హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు. దీంతో ఎమ్మెల్యే ఇంట్లో విషాదం నెలకొంది. వయసు మీద పడటం, పలు ఇతర అనారోగ్య కారణాలతో సత్యనారాయణ కన్నుమూశారు. హైదరాబాద్ లోని కోకాపేటలో ఉన్న క్రిన్స్ విల్లాస్ లో సత్యనారాయణ పార్థీవ దేహాన్ని ఉంచారు. హరీశ్ రావు తండ్రి ఆకస్మిక మరణంతో తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ నాయకులు ఆయనకు సంతాపం ప్రకటించారు. ఇవాళ మధ్యాహ్నం ఫిలిం నగర్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
Advertisement
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement
Advertisement

