h4 visa work permit supreme court: అమెరికాలోని భారతీయ టెక్ నిపుణులకు గొప్ప శుభవార్త. H-1B వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములకు పని చేసుకునే అనుమతి కొనసాగుతుందని అమెరికా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ‘సేవ్ జాబ్స్ USA’ దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించడంతో, H-4 వీసా హోల్డర్ల పని హక్కుపై ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.
2015లో ఒబామా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానం, గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు పెండింగ్లో ఉన్న వారి భార్యలకు ఉద్యోగం చేసుకునే అవకాశం ఇస్తుంది. ఈ నిర్ణయం వేలాది భారతీయ కుటుంబాలకు, ముఖ్యంగా మహిళలకు ఊరటనిచ్చింది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
