మన పత్రిక, హైదరాబాద్: స్టార్ మా ఛానెల్లో ప్రసారమయ్యే ‘గుండె నిండా గుడి గంటలు’ సీరియల్ నేటి (ఏప్రిల్ 7) ఎపిసోడ్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముంబై ముఖేష్ ఫర్నిచర్ ప్రమోషన్ కోసం మనోజ్ తన ఫ్యామిలీతో కలిసి యాడ్ షూట్‌కి అంగీకరిస్తాడు.
జంటకు 50 వేలు చొప్పున పారితోషికం ఇస్తానని ముఖేష్ చెప్పినా, మనోజ్ ఆ విషయాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పడు. ఫ్రీగా ప్రమోషన్ చేయిస్తున్నట్లు కుటుంబాన్ని నమ్మిస్తాడు. తల్లి ప్రభావతికి మాత్రం తను ఇస్తున్నట్లుగా 10 వేలు ముట్టజెబుతాడు. యాడ్ షూట్ కోసం వచ్చిన డైరెక్టర్ ముక్కోటి ముకుందం సెట్లో సత్యంపై పలుమార్లు అరుస్తాడు. దీంతో బాలుకు డైరెక్టర్‌కు మధ్య గొడవ జరుగుతుంది.
ఫ్రీగా చేస్తున్నందుకే ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావా అని బాలు డైరెక్టర్‌ను నిలదీస్తాడు. అప్పుడు ముక్కోటి అసలు నిజం బయటపెడతాడు. ఫ్రీగా కాదని, మనిషికి రూ. 25 వేల చొప్పున మనోజ్‌కి ఇప్పటికే 2 లక్షలు ఇచ్చారని చెప్పడంతో కుటుంబ సభ్యులంతా షాక్‌కు గురవుతారు. మనోజ్ తలదించుకోవడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.
ఇవి కూడా చదవండి :
- Peddi : అడ్వాన్స్ బుకింగ్స్ లో పెద్ది జోరు… సెంచరీ ఖాయం…
- Summer Holidays : ఎండల ఎఫెక్ట్ వేసవి సెలవులు పొడిగింపు..
- TG TET 2026 Schedule : టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల.. 10 సెషన్లలో ఆన్లైన్ పరీక్షలు
- TG Employees Health Scheme : ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్త్ కేర్ ట్రస్ట్..
- AP News : వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మయూరి రఘునాథ్ రెడ్డి
