Advertisement

Gopichand : మ్యాచో స్టార్ మూవీపై అదిరిపోయే అప్డేట్…

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) హీరోగా నటిస్తున్న తన 33వ చిత్రంపై ఫ్యాన్స్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్న గోపీచంద్ కి ఒక భారీ సక్సెస్ కావాలి. అందుకే ఇంకా టైటిల్ కూడా పెట్టని తన కొత్త సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. అప్పుడెప్పుడో బర్త్ డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ వదిలిన మేకర్స్ నుండి మళ్ళీ ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇప్పుడు ఫైనల్ గా మేకర్స్ నుండి క్రేజీ అప్డేట్ వచ్చింది.

ఇక ఈ సినిమాని ఘాజి మూవీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి (Sankalp Reddy) తెరకెక్కిస్తున్నాడు. ఒక భారీ హిస్టారికల్ చిత్రంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీమ్ నుండి వచ్చిన అప్డేట్ ప్రకారం చిత్ర యూనిట్ భారీ ఖర్చుతో ఈ సినిమా సన్నివేశాలు డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కి సంబంధించి సాలిడ్ క్లైమాక్స్ ఎపిసోడ్ చిత్రీకరణ కు ప్లాన్ చేస్తున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్ వెంకట్ మాస్టర్ (Venkat master) సారథ్యంలో ఒక నైట్ షూట్ తో అదిరిపోయే క్లైమాక్స్ ని షూట్ చేస్తున్నారు. ఈ సీక్వెన్స్ షూట్ చాలా రోజుల పాటు ఉంటుందని సమాచారం. ఇక ఈ సినిమా నుండి మరిన్ని అప్డేట్ రావాల్సి ఉంది.

Advertisement

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గురించి గాని, ఇతర ప్రధాన పాత్రధారుల గురించి మూవీ టీమ్ నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు. మేకర్స్ కూడా వీలైనంత వరకు పగడ్బందీగా ఎలాంటి లీక్స్ దొరక్కుండా జాగ్రత్తపడుతున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ (Sreenivasa Silvar Screen) వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను 2026 సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement