మన పత్రిక, వెబ్‌డెస్క్: బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఊగిసలాటలో ఉన్నాయి. నిన్న ఒక్కరోజే కిలో వెండి ధర రూ.20 వేలు పడిపోగా, అంతకుముందు అంతే స్థాయిలో పెరిగింది. అయినా జనం ఎగబడి కొంటున్నారు. కొద్ది నెలల్లోనే వెండి రూ.2.50 లక్షలు, బంగారం రూ.1.40 లక్షలు దాటడం సామాన్యులతో పాటు వ్యాపారులను కూడా విస్మయానికి గురిచేస్తోంది. అసలు ఈ పరుగు ఎక్కడి దాకా వెళ్తుంది? ఇప్పుడు కొనడం సురక్షితమేనా? అనే సందేహాలు అందరిలోనూ ఉన్నాయి.
ధరల పెరుగుదలకు కారణాలివే: ప్రధానంగా సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), 5G టెక్నాలజీలో వెండి వినియోగం పెరగడం వల్లే ఈ డిమాండ్ ఏర్పడింది. వెండి కేవలం ఆభరణంగానే కాకుండా ‘పారిశ్రామిక లోహం’గా మారడమే దీనికి కారణం. మరోవైపు అంతర్జాతీయంగా గనుల నుంచి ఉత్పత్తి తగ్గడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం కూడా ధరలకు రెక్కలు తొడుగుతున్నాయి.
నిపుణుల సలహా (70:30 సూత్రం): 2026 నాటికి బంగారం రూ.1.6 లక్షలు, వెండి రూ.3 లక్షలకు చేరే అవకాశం ఉందని మార్కెట్ అంచనా. అయితే, వెండిలో రిస్క్ ఎక్కువ-లాభం ఎక్కువ (High Risk-High Return) కాగా, బంగారం సురక్షితమైన పెట్టుబడి (Safe Bet) అని నిపుణులు చెబుతున్నారు. రిస్క్ తగ్గించుకోవడానికి పెట్టుబడిదారులు తమ మొత్తంలో 70% బంగారంలో, 30% వెండిలో పెట్టడం ఉత్తమమని సూచిస్తున్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
