మన పత్రిక, హైదరాబాద్: బంగారం కొనుగోలుదారులకు ఊరటనిస్తూ పసిడి, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇరాన్ యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో ఈ మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, స్టాక్ మార్కెట్ల పతనం వంటి అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ.. మదుపరులు బంగారం నుంచి డాలర్ బాండ్ ఈల్డ్స్ వైపు మొగ్గుచూపడంతో శుక్రవారం మార్కెట్లో పసిడి ధరలు దిగివచ్చాయి.
అంతర్జాతీయ మార్కెట్లో వరుసగా రెండో రోజు కూడా పసిడి ధరలు తగ్గాయి. ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 54 డాలర్లు తగ్గి 5,117 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా స్పాట్ సిల్వర్ ధర 0.24 శాతం పడిపోయి ఔన్సుకు 85.14 డాలర్లకు చేరుకుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మార్చి 13 ఉదయం 7 గంటల సమయానికి ధరల వివరాలు గమనిస్తే.. తులం 22 క్యారెట్ల బంగారంపై రూ. 1000, 24 క్యారెట్లపై రూ. 1090 మేర తగ్గింది. అలాగే కిలో వెండి ఏకంగా రూ. 10 వేలు పడిపోయి మూడు లక్షల మార్కు దిగువకు చేరింది. అయితే ఈ ధరలు మధ్యాహ్నానికి మారే అవకాశం ఉంటుందని వ్యాపారులు సూచిస్తున్నారు.
హైదరాబాద్లో నేటి (మార్చి 13) ధరల వివరాలు:
| లోహం / క్యారెట్ | పరిమాణం | తగ్గిన ధర (రూ.) | ప్రస్తుత ధర (రూ.) |
| 22 క్యారెట్ల బంగారం | 10 గ్రాములు | 1,000 | 1,48,700 |
| 24 క్యారెట్ల బంగారం | 10 గ్రాములు | 1,090 | 1,62,220 |
| వెండి | 1 కిలో | 10,000 | 2,90,000 |
ఇవి కూడా చదవండి :
- UstaadBhagathSingh : “నా కల… ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో నెరవేరింది”! – రాశీ ఖన్నా
- Rajendraprasad : ఎం.జి.ఆర్ వివాదం: చివరికి సారీ చెప్పిన నట కిరీటి రాజేంద్రప్రసాద్!
- మంత్రి ఉత్తమ్.. గ్యాస్ సిలిండర్లు పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు
- నిజామాబాద్ గన్నారం వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా.. నలుగురు మృతి
- Miryalaguda: మిర్యాలగూడలో అధికారుల దాడులు.. 6 గ్యాస్ సిలిండర్ల సీజ్
