రెండు రోజుల క్రితం గోదావరి నీటిమట్టం 30 అడుగుల వద్ద ఉండగా, క్రమంగా పెరుగుతూ ఇవాళ ఉదయానికే 40 అడుగులకు చేరింది. మధ్యాహ్నం లోపు 43 అడుగులకు చేరడంతో పరిస్థితి ఉద్రిక్తతగా మారింది. స్నానఘట్టాల వద్ద చాలా మెట్లు, విద్యుత్ స్తంభాలు నీటిలో మునిగిపోయాయి. నదిలో స్నానాలు చేయడం అత్యంత ప్రమాదకరం అని అధికారులు హెచ్చరించారు.
భక్తులు స్నానఘట్టాలకు దూరంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే భద్రమైన ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. పరిస్థితిపై నిరంతరం నిఘా ఉంచుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రమాద హెచ్చరికలు మరింత దశల్లోకి వెళ్లే అవకాశం ఉంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమి.. బీజేపీ ఘనవిజయం
- TVK Vijay : విజయ్ సీఎం గెలుపుతో కోలీవుడ్‌లో భారీ మార్పులు
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
Advertisement
