బిగ్ బాస్ సీజన్ (Bigg Boss Season 9) లో శ్రీజ ఎలిమినేషన్ అనంతరం 6గురు వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీళ్ళలో ఇద్దరు కంటెస్టెంట్లు వరెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తుండగా, మరో ఇద్దరు ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్త (Gaurav Gupta) మాత్రం భాష రాక ఇబ్బంది పడుతున్నారు.
అసలు బిగ్ బాస్ హౌస్ కి వీళ్ళని ఎలా సెలెక్ట్ చేసారా అని ఇప్పటికి ఆడియన్స్ కి అర్ధం కావట్లేదు. ముఖ్యంగా గౌరవ్ కి ఏమాత్రం తెలుగు వచ్చినట్టు లేదు. అందుకే నాగార్జున (Nagarjuna) వచ్చే వారం లోగా గౌరవ్ ని తెలుగులో మాట్లాడించమని దివ్య కి టాస్క్ ఇచ్చాడు. ఇటు దివ్య కూడా వీలు చిక్కనప్పుడల్లా తెలుగులో మాట్లాడిస్తుంది. అయితే గౌరవ్ ఫిజికల్ టాస్కుల్లో బాగా ఆడుతున్నా, భాష పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు.
తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో అది గౌరవ్ చేత హౌస్ మొత్తం కూడా తెలుగు నేర్పించే పని పెట్టుకుంది. ఆయేషా, ఇమ్మాన్యుయెల్, సంజన, సుమన్ శెట్టి సహా అందరూ గార్డెన్ లో కూర్చుని గౌరవ్ చేత తెలుగు మాట్లాడిస్తున్నారు. బిగ్ బాస్ చూస్తున్న ఆడియన్స్ కి మాత్రం ఇతగాడికి తెలుగు మాట్లాడించే టాస్క్ తప్ప ఇంకేదీ ఇచ్చేలా లేరు అని ట్రోల్ చేస్తున్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
