Advertisement

నెట్‌ఫ్లిక్స్‌లో తాప్సీ ‘గాంధారి’ స్ట్రీమింగ్

మన పత్రిక: తాప్సీ పన్ను, ఇష్వాక్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘గాంధారి’ నేరుగా డిజిటల్ వేదికపై అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో సెప్టెంబర్ 3న మధ్యాహ్నం 12:30 గంటల నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.

ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఓ హింసాత్మక దాడిలో తాత్కాలికంగా దృష్టి కోల్పోయిన ‘బానీ’ అనే తల్లి, తన చిన్న కూతురు కిడ్నాప్‌కు గురికావడంతో ఎదుర్కొన్న పరిస్థితుల చుట్టూ తిరుగుతుంది. కూతురిని కాపాడుకోవడానికి బానీ స్వయంగా రంగంలోకి దిగి, ప్రమాదకరమైన మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్‌తో పోరాటం చేస్తుంది.

Advertisement

దేవాశిష్ మఖిజా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కనికా ధిల్లాన్ కథను అందించారు. ఈ సినిమాలో తాప్సీ, ఇష్వాక్ సింగ్‌లతో పాటు ఛాయా కదమ్, స్వస్తిక ముఖర్జీ, మితా వశిష్ట్, జతిన్ సర్నా ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

Advertisement