Flipkart Diwali Sale : మనకు అత్యంత ప్రీతికరమైన పండుగ ఏదైనా ఉంది అంటే అది దివాళి అనే చెప్పుకోవాలి. దీపావళి పండుగ వచ్చిందంటే కొత్త బట్టలు, పిండి వంటలు, టపాసులు, స్వీట్లు ఇలా ఆ సందడే వేరు అని చెప్పుకోవాలి. షాపింగ్ చేసేవాళ్లకు దీపావళి పండుగ వచ్చిందంటే చాలు. అందుకే ప్రముఖ ఈకామర్స్ కంపెనీలు కూడా పలు డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకర్షిస్తుంటాయి.
ఫ్లిప్ కార్ట్ కూడా దివాళి సందర్భంగా పలు ఆఫర్లను తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్ దివాళి సేల్ పేరుతో తీసుకొచ్చిన సేల్ ను అక్టోబర్ 11 నుంచి ప్రారంభించనున్నారు. ఈ సేల్ లో భాగంగా కస్టమర్లు ఎలక్ట్రానిక్స్ వస్తువులు, హోమ్ అప్లయెన్సెస్, గ్యాడ్జెట్స్, లాప్ టాప్స్ ఇలా అన్ని రకాల వస్తువులపై భారీగా డిస్కౌంట్లను అందిస్తున్నారు.
వాటితో పాటు ఫ్లిప్ కార్టులో కనీసం రూ.50 వేలతో షాపింగ్ చేస్తే వాళ్లు ఎలక్ట్రిక్ స్కూటీ గెలుచుకునే అవకాశాన్ని పొందుతారు. రూ.1.5 లక్షల విలువైన ఎలక్ట్రిక్ స్కూటీని గెలుచుకునే అవకాశం ఉంది. కనీసం రూ.50 వేలతో షాపింగ్ చేసిన వాళ్ల పేర్లతో లక్కీ డ్రా తీస్తారు. ఆ లక్కీ డ్రాలో గెలిచిన వారికి ఏథర్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటీని ఫ్రీగా అందించనుంది ఫ్లిప్ కార్ట్.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

