టాలీవుడ్ లో దసరా పండగ సినిమాల హడావిడి అయిపొయింది. “ఓజి”, కాంతార 2 సినిమాలు రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ సక్సెస్ లు సాధించగా, ఈ దీపావళి కానుకగా నాలుగు చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలన్నీ రిలీజ్ కి ముందే ట్రైలర్స్ సాంగ్స్ తో వేటికవే మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, థియేట్రికల్ రిలీజ్ తర్వాత సీన్ మారిపోయింది.
దీపావళి కానుకగా రిలీజ్ అయిన నాలుగు సినిమాలు కూడా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకున్నాయి. “మిత్ర మండలి”, “తెలుసు కదా”, “K రాంప్” తో పాటు డ్యూడ్ సినిమాలు రిలీజ్ అవగా అన్ని కంటెంట్ పరంగా రొటీన్ టాక్ తెచ్చుకున్నాయి. థియేటర్ల వద్ద కూడా ఎక్కడా పెద్దగా హౌస్ ఫుల్ బోర్డులు పడట్లేదు.
అయితే వీటిలో ఉన్నంతలో డ్యూడ్ కొంతమేర డీసెంట్ అనిపించుకుంటుంది. ప్రదీప్ రంగనాథన్ గత సినిమాల సక్సెస్ వల్లో లేక, ఇతర సినిమాల డివైడ్ టాక్ వల్లో డ్యూడ్ సినిమాకి మెజారిటీ ఆడియన్స్ మొగ్గు చూపుతున్నారు. ఫస్ట్ డే డ్యూడ్ సినిమా ప్రదీప్ రంగనాథన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ (21 కోట్లు) అందుకోగా, రెండో రోజు కూడా స్ట్రాంగ్ హోల్డ్ చూపిస్తుంది. మరి దీపావళి పండగ పూర్తయ్యేలోపు ఏ సినిమా టపాకాయ పూర్తిగా పేలుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
