WhatsApp
Advertisement

Vemuri Kaveri Travels : వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో పొగలు

Vemuri Kaveri Travels : కర్నూలులో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఘటన మరవకముందే అదే ట్రావెల్స్ కు చెందిన మరో బస్సులో పొగలు వచ్చాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్ పేట్ ఫ్లైఓవర్ పై చోటు చేసుకుంది. ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత బస్సులో పొగలు రావడం ప్రారంభమయ్యాయి.

బస్సు ఓవర్ హీట్ తో టైర్ల నుంచి పొగలు వచ్చాయి. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న బస్సు అది. రాత్రి పూట బస్సులో పొగలు రావడంతో వెంటనే బస్సును ఆపి బస్సులో ఉన్న 26 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందికి దింపారు. కానీ, ప్రయాణికులు మాత్రం చలిలో చాలాసేపు రోడ్డు మీదే పడిగాపులు పడాల్సి వచ్చిందని తెలుస్తోంది.

Advertisement
Advertisement