Advertisement
fire accident in private travel bus in kurnool

Bus Fire Accident :  బస్సులో మంటలు.. 20 మందికి పైగా సజీవ దహనం

Bus Fire Accident : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో 20 మందికి పైగా సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లాలో ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది వరకు ఉన్నారు. ఇందులో 20 మందికి పైగా మంటల్లో చిక్కుకొని చనిపోయారు.

Advertisement

కర్నూలు జిల్లాలోని ఉలిందకొండ సమీపంలోకి బస్సు రాగానే వెనుక నుంచి బస్సును ఓ బైక్ ఢీకొట్టింది. ఆ బైక్ బస్సు కింద ఉన్న ఫ్యూయెల్ ట్యాంక్ ను ఢీకొట్టడంతో ఫ్యూయెల్ బయటికి వచ్చి మంటలు చెలరేగాయి. దీంతో బస్సు మొత్తం ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. అర్ధరాత్రి కావడంతో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. వెంటనే తేరుకున్న కొందరు ప్రయాణికులు బస్సు నుంచి బయటకు రాగా, మరికొందరు ప్రయాణికులు బస్సులోనే చిక్కుకుపోయి దుర్మరణం పాలయ్యారు. గాయపడ్డ వారిని కర్నూలు లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులో ఉన్న ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ కు చెందిన వారిగా తెలుస్తోంది.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement