Advertisement
fire accident at fire works in ap

AP Fire Accident : బాణసంచా తయారీ కంపెనీలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి

AP Fire Accident : బాణసంచా తయారీ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది.

Advertisement

రాయవరంలో ఉన్న గణపతి బ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా భారీ శబ్దంతో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో పనిచేసే కార్మికుల్లో ఆరుగురు మంటల్లో చిక్కుకొని సజీవ దహనం అయ్యారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి.

Advertisement

ఫైర్ యాక్సిడెంట్ అయిన సమయంలో కంపెనీలో 40 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే పరిశ్రమలోని వస్తువులు మొత్తం కాలి బూడిదయ్యాయి.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement