మన పత్రిక: 2026లో జరిగిన ఫిఫా ప్రపంచ కప్ టోర్నీ నిర్వాహక కమిటీకి భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. నివేదికల ప్రకారం, ఈ టోర్నీ ద్వారా మొత్తం 87 వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. కేవలం టికెట్ల అమ్మకాలు మరియు ప్రకటనల ద్వారానే 9 బిలియన్ డాలర్ల ఆదాయం లభించింది. క్రీడా ప్రపంచంలోనే ఏ ఇతర పోటీకి ఇంతటి స్థాయిలో ఆదాయం రాకపోవడం గమనార్హం.
ఈసారి మూడు దేశాలు సంయుక్తంగా ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌ను నిర్వహించాయి. లియోనెల్ మెస్సీ మరియు క్రిస్టియానో రోనాల్డో వంటి దిగ్గజ క్రీడాకారులకు ఇదే చివరి ప్రపంచ కప్ కావడంతో, వారిని వీక్షించేందుకు అభిమానులు స్టేడియాలకు భారీగా తరలివచ్చారు. టికెట్ ధరల్లోని వ్యత్యాసాలు కూడా ఆదాయం పెరగడానికి దోహదపడ్డాయి. వచ్చిన ఈ ఆదాయాన్ని ఫుట్‌బాల్ క్రీడను మరింతగా విస్తరించేందుకు ఉపయోగిస్తామని నిర్వాహక కమిటీ ప్రకటించింది. అయితే, భవిష్యత్తులో జరిగే సీజన్లలో ఇటువంటి స్థాయిలో టికెట్ అమ్మకాలు సాధ్యం కాకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
