మన పత్రిక, చిక్కబళ్లాపూర్: కర్ణాటకలోని Chikkaballapur పట్టణంలో 13 రోజుల ఆడపిల్ల హత్యకు గురైన దారుణ సంఘటన వెలుగుచూసింది. ఆడపిల్ల జన్మించిందనే కోపంతోనే సొంత తండ్రే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇమ్రాన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జులై 22న రాత్రి కుటుంబ సభ్యులందరూ నిద్రపోతున్న సమయంలో, ఇమ్రాన్ నిద్రపోతున్న పసిపాపను ఇంట్లోని నీటి సంప్‌లో పడేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఉదయం లేచి చూడగా పాప కనిపించకపోవడంతో తల్లి భర్తను ప్రశ్నించింది. తనకు ఏమీ తెలియదని నమ్మించిన ఇమ్రాన్, పాప కోసం ఇతరులతో కలసి వెతికే నాటకమాడాడు. చివరికి నీటి సంప్‌లోని నీటిని తోడి చూడగా పాప మృతదేహం బయటపడింది.
బాధితుల ఫిర్యాదు మేరకు చిక్కబళ్లాపూర్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మగసంతానం కావాలనే కోరికతోనే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పసిపాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
- తెలంగాణ బంద్ పిలుపుతో హైదరాబాద్‌లోని పాఠశాలలకు నేడు సెలవు
- ఐఫోన్‌కు బదులు గడ్డం నూనె పంపిన ఘటనలో ఫ్లిప్‌కార్ట్‌కు వినియోగదారుల కమిషన్ జరిమానా
- పేపర్ లీక్‌లపై ప్రధాని మోదీ వీడియో సందేశం కాంగ్రెస్ తీవ్ర విమర్శలు
- కాశ్మీర్ అంశంపై ఐఓసీ వ్యాఖ్యలను తప్పుపట్టిన భారతదేశం
- విద్యార్థులను దేశ శత్రువులుగా చూస్తున్నారు: కేంద్ర ప్రభుత్వంపై సోనియా గాంధీ మండిపాటు
