Father Suicide : కూతురు పెళ్లి ఆగిపోయిందని ఓ తండ్రి మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. తీరా పెళ్లి సమయానికి తమకు ఈ పెళ్లి ఇష్టం లేదని పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు చెప్పడంతో పెళ్లి ఆపోద్దంటూ పెళ్లి కూతురు తండ్రి వాళ్ల కాళ్ల మీద పడ్డా కూడా వినలేదు. దీంతో మనస్థాపానికి గురై ఆ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో డాక్టర్ గా పని చేస్తున్న తన కూతురుకు బ్యాంకు ఉద్యోగి అయిన ఓ యువకుడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు నిశ్చయం చేసుకున్నాడు ఆ తండ్రి. వివాహ ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెండ్లి పత్రికలు పంచారు. పెళ్లి ఇంకా కొన్ని రోజుల్లో ఉందనగా, తమకు ఈ పెళ్లి ఇష్టం లేదని పెళ్లి కొడుకు తండ్రి అనడంతో పెళ్లి కొడుకు కుటుంబ సభ్యుల కాళ్ల మీద పడ్డా కూడా వాళ్లు ఒప్పుకోకపోవడంతో తండ్రి శ్రీనివాసరావు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
