మన పత్రిక: ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ ట్రోఫీ ప్రదానోత్సవ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తన సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసింది. టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన స్పెయిన్ జట్టు కెప్టెన్ రోడ్రికి ట్రోఫీని అందించిన అనంతరం, ట్రంప్ పోడియంపైనే ఉండిపోయారు. ఆయన కెమెరా ఫ్రేమ్‌లో కనిపించేందుకు ప్రయత్నిస్తుండటంతో స్పెయిన్ ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు.
ఈ క్రమంలో స్పెయిన్ జట్టు కెప్టెన్ ట్రంప్ చేతిని పట్టుకుని, ఆయనను పక్కకు వెళ్లమని సూచించినట్లుగా ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికే ట్రంప్ అక్కడ నిలబడ్డారని నెటిజన్లు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
