Advertisement

తమిళనాడు సీఎంపై వివాదాస్పద వ్యాఖ్యలు: డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అరెస్ట్

మన పత్రిక, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై అభ్యంతరకరమైన మరియు బెదిరింపు వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎమ్మెల్యే జీఆర్ మార్కండేయన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జూలై 18న జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టీవీకే ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ చర్య తీసుకున్నారు. ఎమ్మెల్యేను ప్రస్తుతం టుటికోరిన్ ఎస్పీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు.

అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఎమ్మెల్యే మార్కండేయన్ వివాదాస్పదంగా మాట్లాడారు. ఈ అరెస్టుకు నిరసనగా డీఎంకే నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కాగా, ఈ నెల ప్రారంభంలోనే ముఖ్యమంత్రి విజయ్‌పై వ్యాఖ్యలు చేసిన మరో డీఎంకే ఎమ్మెల్యే అనిత రాధాకృష్ణన్‌ను కూడా పోలీసులు అరెస్టు చేయగా, ఆయన అదే రోజు బెయిల్‌పై విడుదలయ్యారు.

Advertisement
Advertisement