Advertisement

Divvela Madhuri : ఇంత అహమా.? ఇలా అయితే కష్టమే..

Bigg Boss Season9 : బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 9 వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ఎంట్రీ తో ఫుల్ బూస్టప్ అందుకుంటుందని నిన్నటి వరకు చాలా మంది అనుకున్నారు. కానీ వచ్చిన కంటెస్టెంట్లు ఇంతలా దిగజారి పోతారని ఎవ్వరూ గెస్ చేసి ఉండరేమో. ముఖ్యంగా దివ్వెల మాధురి (Divvela Madhuri) బయట ఎలా ఉందొ హౌస్ లో కూడా అలాగే బిహేవ్ చేస్తుందని మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా రాత్రి టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ తో మరింత బహిర్గతం అయింది.

బిగ్ బాస్ హౌస్ లో కుకింగ్ సెక్షన్ లో హెల్ప్ కోసం వైల్డ్ కార్డ్స్ తరపున దివ్వెల మాధురిని కెప్టెన్ కళ్యాణ్ ఎంపిక చేసాడు. అయితే దానికి సరేనన్న మాధురి మార్నింగ్ కుకింగ్ సెక్షన్ లో మాత్రం ఎలాంటి సహాయం చేయకపోగా కళ్యాణ్ పై అరుస్తూనే ఉంది. హౌస్ మేట్స్ ఆపుతున్నా వినకుండా తానక్కడ ఉన్నప్పుడు పని చెప్పకుండా ఇప్పుడు పని చెప్తారేంటి అంటూ కళ్యాణ్ పై అరుస్తూ ఉంది. దాదాపు అర గంట సేపు ఈ తతంగం జరిగాక తానేమి తప్పు చేయనట్టు మొహం పెట్టుకుని ఏడుస్తూ ఉంది. దాంతో కళ్యాణే కాస్త తగ్గి మాధురిని సముదాయించాడు.

Advertisement

అయితే హౌస్ బయట నుండే మాధురికి కంటెస్టెంట్లపై ఒక విధమైన అభిప్రాయం ఏర్పడింది. అందుకే హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే శ్రీజ పై నోరు పారేసుకుంది. ఆ వెంటనే నెక్స్ట్ డే కళ్యాణ్ పై విరుచుకుపడింది. ఇక ఆ తర్వాత దివ్య, భరణి లను కూడా టార్గెట్ చేద్దామని ట్రై చేస్తుంది. ఇదిలాగే సాగితే హౌస్ లో మాధురి రెండు వారాలు కూడా ఉండడం కష్టమే. ఏది ఏమైనా ఆమె ప్రవర్తన మార్చుకోకపోతే హౌస్ లో అందరూ కలిసే బైటికి పంపేలా ఉన్నారు.

Advertisement