మన పత్రిక, వెబ్‌డెస్క్: జిల్లాలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పనులను అక్టోబర్ నెలాఖరు వరకు తప్పనిసరిగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ ( Collector P Srija ) కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షలో, అధికారులతో పనుల పురోగతిని సమీక్షించారు. పనులు పూర్తి చేసి ఎంబీ రికార్డులు నమోదు చేస్తే వెంటనే బిల్లులు విడుదల చేయడం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు.
ప్రతి పాఠశాల వారీగా పనుల పురోగతిని రివ్యూ చేసిన అదనపు కలెక్టర్, గ్రామాల్లో పాఠశాలకు నీరు సరఫరా లేని పక్షంలో మిషన్ భగీరథ పైప్ లైన్ నుంచి కనెక్షన్ అందించాలని సూచించారు.
సకాలంలో పనులు పూర్తి కాని పక్షంలో సంబంధిత పాఠశాల సిబ్బంది, ఇంజనీరింగ్ అధికారుల వేతనంలో కోత విధించడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో విద్యా శాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ సి.హెచ్. రామకృష్ణ, ఎంపీడీఓలు, ఎం.ఈ.ఓ.లు, హెడ్ మాస్టర్లు, ఏఈలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
