Advertisement
Did Sukumar give a second chance to kriti sanon

Sukumar : ప్లాప్ బ్యూటీకి సుక్కూ రెండో ఛాన్స్?

టాలీవుడ్ లో తెరకెక్కబోయే మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్టులలో RC17 ఒకటి. సుకుమార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలయికలో రెండో సారి తెరకెక్కబోయే ఈ ప్రాజెక్ట్ ఇంకా మొదలు పెట్టకపోయినా, సుకుమార్ ఈ సినిమాకి కాస్ట్ ని డిసైడ్ చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకి హీరోయిన్ గా ఎవరూ ఊహించని హీరోయిన్ ని తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ హీరోయిన్ కి ఇప్పటికే తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఐరన్ లెగ్ అనే ట్యాగ్ ఉంది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ భామ కృతి సనన్.

Advertisement

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) డైరెక్ట్ చేసిన వన్ నేనొక్కడినే సినిమాతోనే కృతి సనన్ (Kriti sanon) హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో, తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. వచ్చినా ఆ మిగతా సినిమాలు ప్లాప్ కాగా, హిందీలో కూడా సరిగా క్లిక్ అవలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆది పురుష్ కూడా ప్లాప్ అయింది. ఈ క్రమంలో సుకుమార్ పిలిచి మరి రామ్ చరణ్ సినిమాలో అవకాశం ఇచ్చాడని టాక్ నడుస్తుంది.

Advertisement

మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మేకర్స్ అనౌన్స్ చేసే వరకు ఆగాలి. ఇక RC 17 సుకుమార్ – రామ్ చరణ్ ల కాంబో లో తెరకెక్కుతున్న రెండో సినిమా కాగా, మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement