Advertisement

‘ఢీ’ షో విన్నర్ రాజు అరెస్ట్.. లైంగిక వేధింపుల కేసు

TG: ప్రసిద్ధ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ 10’ విజేత రాజుపై మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ నెల 9న ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు, మూడు రోజుల తర్వాత తాజాగా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మియాపూర్ ఇన్‌స్పెక్టర్ జయరాం తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, కేసు నమోదు చేసిన విషయాన్ని పోలీసులు ఇన్నాళ్లు గోప్యంగా ఉంచడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆలస్యంగానైనా నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవల ముగిసిన ‘ఢీ 20’ సీజన్‌లోనూ రాజు టైటిల్ గెలుచుకోవడం గమనార్హం.

Advertisement