WhatsApp
Advertisement

Delhi Car Blast : ఎర్రకోట వద్ద కారు పేలుడు.. ఉగ్రవాద చర్యగా ప్రకటించిన కేంద్రం

Delhi Car Blast : ఈ నెల 10వ తేదీన సాయంత్రం ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ వద్ద జరిగిన కారు బాంబు పేలుడు ధాటికి పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరికొంతమంది గాయపడ్డారు. వాళ్లకు చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిని ప్రధాని మోదీ కూడా పరామర్శించారు. మరోవైపు ఈ కారు బాంబు పేలుడు ఒక సూసైడ్ మిషన్ గా పోలీసులు గుర్తించారు. ఇది ఖచ్చితంగా ఉగ్రవాద చర్యే అని కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉగ్రదాడి చేసేందుకు ప్లాన్ చేసిన పలువురు ఉగ్రవాదులను పోలీసులు ఇప్పటికే అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.

అయితే.. ఎర్రకోట వద్ద సిగ్నల్ పడటంతో వాహనాలన్నీ ఆగిపోయాయి. సిగ్నల్ కోసం వేచి చూస్తున్నాయి. ఇంతలో ఆ సిగ్నల్ లో వాహనాల మధ్యలో ఉన్న కారు ఒక్కసారిగా పేలింది. పేలుడు ధాటికి పక్కనే ఉన్న చాలా వాహనాలు దెబ్బతిన్నాయి. ఆ కారుకు సమీపంలో ఉన్న వారిలో 12 మంది మృతి చెందారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement
Advertisement