టాలీవుడ్ లో ఈ సమ్మర్ లో పెద్ద సినిమాలు లేక థియేటర్లు వెలవెలబోతున్న సంగతి తెలిసిందే. వచ్చిన చిన్న సినిమాలు కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఎంతో కొంత రెండు వారాల కింద వచ్చిన డెకాయిట్ థియేటర్లకు కాస్త ఊపునిచ్చింది. ఇక ఇప్పుడు మళ్ళీ థియేటర్లలో సరైన సినిమా లేక ఆడియన్స్ కూడా ఆసక్తి చూడడం లేదు. దీనికి తోడు ఐపీఎల్ ఎఫెక్ట్ ఇండస్ట్రీ పై గట్టిగా పడింది. ఈ క్రమంలో టాలీవుడ్ లో తాజాగా రీ రిలీజ్ అయిన సినిమానే థియేటర్లకు దిక్కయింది.
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన డార్లింగ్ మూవీ అప్పట్లో మంచి హిట్టయింది. దాదాపు 16 ఏళ్ళ తర్వాత ఇప్పుడు డార్లింగ్ మూవీని సమ్మర్ స్పెషల్ గా థియేటర్లలో రీ రిలీజ్ చేసారు మేకర్స్. మొదట ఈ సినిమా గురించి పెద్దగా పట్టించుకోరు అనుకున్నా, అదిరిపోయే బుకింగ్స్ తో థియేటర్ల వద్ద సందడి చేస్తుంది డార్లింగ్ మూవీ. ఏప్రిల్ 23న రిలీజ్ అయిన 3 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ తో ఓపెన్ అవగా, ఫస్ట్ డే 5 కోట్ల వరకు రావొచ్చని అంచనా వేస్తున్నారు.
ఇక ఈ వారం రెండు చిన్న సినిమాలు రిలీజ్ ఉన్నా కూడా డార్లింగ్ సినిమాకు ఈ రేంజ్ బుకింగ్స్ రావడం విశేషమే. మరి వీకెండ్ ముగిసే సరికి డార్లింగ్ మూవీకి ఎలాంటి కలెక్షన్లు వస్తాయో చూడాలి.
ఇవి కూడా చదవండి :
- Tech Mahindra : హైదరాబాద్ టెక్ మహీంద్రా లో భారీ వాక్ ఇన్ డ్రైవ్
- Ustaad Bhagat Singh : రిసల్ట్ ఎలా ఉన్నా గ్లోబల్ వైడ్ టాప్ ట్రెండింగ్ లో!
- RRB NTPC Undergraduate Exam Date 2026 Out | Check CBT-1 Schedule
- TGPSC Recruitment: 20 అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీ
- Tirumala: తిరుమలలో ముగింపు దశకు ఎస్వీ మ్యూజియం ఆధునీకరణ పనులు
