Advertisement

Dacoit Trailer : ధమాకా ట్రైలర్.. శేష్ మాస్ యాక్షన్ అవతార్‌ తో మాస్ ట్రీట్ రెడీ!

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ ట్రైలర్ రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. చాలా కాలంగా వాయిదాలు, రీషూట్స్ తర్వాత ఫైనల్‌గా రిలీజ్‌కు రెడీ అయిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్, సాంగ్స్‌తో హైప్ క్రియేట్ చేసిన టీమ్ ఇప్పుడు ట్రైలర్‌తో మరింత ఇంట్రెస్ట్ పెంచేసింది. ట్రైలర్ గురించి ఒక్క మాటలో చిన్నగా చెప్పాలంటే… హరి (అడివి శేష్), జూలియట్ (మృణాల్ ఠాకూర్) ఇద్దరూ దొంగలుగా కనిపిస్తూ… వారి మధ్య ప్రేమ, విభేదాలు, విడిపోవడం వంటి ఎమోషనల్ ట్రాక్‌ను చూపించారు. హరి జైలుకి వెళ్లడం, జూలియట్ తన కూతురితో వేరే జీవితం ప్రారంభించడం… తర్వాత ఒక కీలక పరిస్థితుల్లో మళ్లీ కలుసుకోవడం స్టోరీకి మెయిన్ పాయింట్ గా కనిపిస్తోంది.

అలాగే పరిస్థితులు వారిని మళ్లీ క్రైమ్ ప్రపంచంలోకి నెడతాయి. అక్కడి నుంచి స్టైలిష్ యాక్షన్, ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్, సర్వైవల్ డ్రామా మిక్స్‌గా సినిమా సాగనున్నట్లు ట్రైలర్ హింట్ ఇస్తోంది. ముఖ్యంగా అడివి శేష్ – మృణాల్ ఠాకూర్ మధ్య ఎమోషన్స్, కళ్లలో కనిపించే ఇన్‌టెన్సిటీ హైలెట్‌గా నిలిచాయి.

Advertisement

ఇక యాక్షన్ షాట్స్ స్టైలిష్‌గా ఉండటంతో పాటు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ట్రైలర్‌కు అదనపు బూస్ట్ ఇచ్చింది. అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక స్పై థ్రిల్లర్స్ జోన్ నుంచి బయటకు వచ్చి ఫస్ట్ టైమ్ ఫుల్ యాక్షన్ మోడ్‌లో అడివి శేష్ కనిపించనుండగా… ‘డెకాయిట్’ మినిమం గ్యారెంటీ మూవీగా ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. డెకాయిట్ సినిమా ఏప్రిల్ 10న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Advertisement