Advertisement
couple kills biker by hitting him with car in bengaluru

Hit and Run Case : కారు సైడ్ మిర్రర్‌కి బైక్ తాకిందని బైకర్‌ను చంపేసిన జంట

Hit and Run Case : కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. తమ కారు సైడ్ మిర్రర్ కు బైక్ తాకిందని.. బైకర్ ను చేజ్ చేసి మరి తమ కారుతో ఢీకొట్టి చంపేసింది ఓ జంట. ఈ ఘటనతో అసలు మనుషుల్లో మానవత్వం ఉందా అనే అనుమానం కలుగుతోంది. కనీసం రెండు కిలోమీటర్ల వరకు ఆ బైకర్ ను కారుతో వెంటాడి మరీ కారుతో ఢీకొట్టి చంపేశారు.

Advertisement

మనోజ్, ఆర్తి దంపతులు కారులో వెళ్తుండగా.. తమ కారు సైడ్ మిర్రర్ కు దర్శన్ అనే ఓ యువకుడు బైక్ తగిలించాడు. తమ కారు సైడ్ మిర్రర్ కే డ్యాష్ ఇస్తావా అని అతడిని ఫాలో అవుతూ కారుతో బైక్ ను ఢీకొట్టడంతో అతడు స్పాట్ లో మృతి చెందాడు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ అవడంతో, ఆ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆ జంటను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. అంత చిన్న విషయానికి మనిషేనే చంపేస్తారా అంటూ ఆ జంటపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement