Cotton Crop : ఆరుగాలం కష్టపడి పండించి.. చేతికొస్తుంది అని అనుకునే లోపే ఆ పంట చేతికి రాకుండా నాశనం అయితే ఆ రైతు బాధ వర్ణణాతీతం. తాజాగా అటువంటి ఘటనే ఒకటి మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని చిన్న గూడూరు మండలం రామచంద్రు తండాలో షార్ట్ సర్క్యూట్ తో రైతు బాదావత్ శంకర్ కు చెందిన పత్తి పంట దగ్ధమైంది. పత్తిని తెంపి ఇంటికి తీసుకొచ్చి ఇంటి ముందు ఆరబెట్టాడు రైతు.
ఏమైందో తెలియదు కానీ.. ఒక్కసారిగా ఆరబెట్టిన పత్తికి నిప్పు అంటుకొని క్షణాల్లో పంట మొత్తం కాలి బూడిదైంది. ఆ పంట విలువ రూ.3 లక్షలు అని కళ్ల ముందే పత్తి పంట కాలిపోతున్నా ఏం చేయాలేకపోయామని రైతు కుటుంబ కంటతడి పెట్టుకుంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతోంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
